2300 కిలోమీటర్లకు చేరుకున్న ప్రజాసంకల్పయాత్ర

0
213

మనఛానల్‌ న్యూస్‌ – పశ్చిమగోదావరి
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వారి సాధకబాధలను ప్రత్యక్షంగా తిలకించే ఉద్దేశ్యంతో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేడు మరోమైలురాయిన అందుకుంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ పాదయాత్రకు అన్నివర్గాల నుండి విశేష స్పందన లభిస్తున్నది. జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు క్రాస్‌ రోడ్డు వద్ద జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 2300 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా నందమూరు క్రాస్‌ రోడ్డులో ఈ మైలురాయికి గుర్తుగా వైఎస్‌ జగన్‌ ఒక మొక్కను నాటారు.