మిట్స్ లో 5 మంది ఎంబిఏ విద్యార్థులకు ఉద్యోగాలు

0
115

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ నందు ఎంబిఏ చివరి సంవత్సరం చదువుతున్న 5 మంది విద్యార్థులకు జరిగిన ప్రాంగణ ఎంపికలలో ఉద్యోగాలకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. సి. యువరాజ్ తెలిపారు.

హైదరాబాద్ కు చెందిన మూవింగ్ ది నీడిల్ అనే సంస్థ నిర్వహించిన ఈ ప్రాంగణ ఎంపికలలో ఎం.బి.ఎ విద్యార్థులు వై. జనార్దన్, బి. శ్రావణి, ఓ. బద్రీనాథ్, ఆర్. కోటేశ్వర రెడ్డి మరియు ఏ.బి. హర్షవర్ధన్ లు ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు.

వీరికి ఏడాదికి రూ.2 లక్షల 88వేలు ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ అన్నారు. ఈసందర్బంగా ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్. సి. యువరాజ్, ఏం. బి. ఏ విభాగాధిపతి డాక్టర్. డి. ప్రదీప్ కుమార్, సీనియర్ ప్లేసెమెంట్ ఆఫీసర్ సర్వాన్ బాబు, ప్లేసెమెంట్ ఆఫీసర్ రవికుమార్ తదితరులు అభినందించారు.