బిగ్ బాస్ -2 లో నేను లేను -శ్రీరెడ్డి

0
71
advertisment

మనఛానల్ న్యూస్ – సినిమాడెస్క్
ఆదివారం నుంచి ఆర్బాటంగా ప్రారంభంకానున్న బిగ్బాస్ -2 కార్యక్రమంలో తాను పాల్గోనడం లేదని వివాదస్పద టాలీవుడ్ నటి శ్రీరెడ్డి తెలిపింది. తనకు అంత అదృష్టం లేదని ఆకార్యక్రమంలో పాల్గోనే వారు ఎంతో అదృష్టవంతులని ఆమె అన్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనందుకు ఎంతో మంది ఆనందం తో ఉంటారని ఆమె అన్నారు

‘బిగ్‌బాస్‌’లో పాల్గొనడం లేదు. హౌస్‌లో నేనుంటానని ఊహించకండి. కొందరికి చాలా సంతోషంగా ఉంటుందని నాకు తెలుసు. కొందరు అప్‌సెట్‌ అవ్వొచ్చు. పోటీదారులు చాలా అదృష్టవంతులు. ‘బిగ్‌బాస్‌’ బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

బిగ్ బాస్ -2 కార్యక్రమం ఆదివారం ప్రారంభం కాబోతుంది. ఈసారి కార్యక్రమం ఎంతో ఆసక్తిగా ఉంటుందని నిర్వహకులు అంటున్నారు. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాత గా చేయబోయే ఈ కార్యక్రమం కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

advertisment