బి.హెచ్. ఈ. ఎల్ ఇంటర్న్ షిప్ ఎంపికైన మిట్స్ విద్యార్థులు

0
457

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లె లోని మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇరువురు విద్యార్థులు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్ట బి.హెచ్.ఇ.ఎల్ లో ఇంటర్న్ షిప్ కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యువరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

మిట్స్ల్ లో బి.టెక్ మూడవ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్న బి. చైతన్య మరియు సాయి ప్రణీత్ లు ఇందులో ఉన్నారని ఆయన తెలిపారు.

బిహెచ్ఇఎల్ లోని నిపుణులతో కలిసి ఈ విద్యార్తులు ఒక నెల రోజుల పాటు హెవీ ఎలక్ట్రానిక్స్ పై పరిశోధనలు చేస్తారని ఆయన అన్నారు. ఈ ఇంటర్న్షిప్ జూన్ 11 నుండి జులై 11 వరకు విద్యార్థులు పాల్గొంటారని అన్నారు.

ఎంపికయిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్. సి. యువరాజ్, డీన్ రామప్రసాద్ రావు, ఈ. సి. ఈ డీన్ డాక్టర్ కషువన్, విభాగాధిపతి రాజశేఖరన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందించారు.