మచిలీపట్నంలో కుండపోత వర్షం

0
318

– లోతట్టు ప్రాంతాలు జలమయం
మనఛానల్‌ న్యూస్‌ – మచిలీపట్నం
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో కుండపోత వర్షం కురుస్తోంది.రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

పట్టణంలోని కోనేరు సెంటర్‌తో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా మసులా బీచ్ ఫెస్టివల్ ప్రచారం కోసం నిర్వహించాల్సిన 2కె రన్ వాయిదా పడింది. బీచ్ ఫెస్టివల్ విజయవంతం కోరుతూ తలపెట్టిన 2కె రన్‌లో పాల్గొనేందుకు ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి వీపీ సింధు మచిలీపట్నం వచ్చారు.

అయితే రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి బందరు పట్టణంలోని పట్టణ ప్రధాన రహదారిపై మోకాలు లోతులో నీరు చేరింది. దీంతో రన్ వాయిదా వేయాలని మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు.

నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో కృష్ణా జిల్లాలో వర్షాలు ఊపందుకున్నాయి. విజయవాడ గ్రామీణ మండలంతో వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.