ముఖ్యమంత్రి మదనపల్లి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

0
546

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
రాష్ట్ర ముఖ్య మంత్రి నారాచంద్రబాబు నాయుడు గురువారం మదనపల్లి పర్యటనకు చిత్తూరు కలెక్టర్ ప్రదుమ్న ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.

ఇందులో భాగంగా కలెక్టర్ మంగళవారం ముఖ్యమంత్రి ఈనెల 7వ తేది నవ నిర్మాణ ధీక్ష చేపట్టే పుంగనూరు మండలం సండ్రమేకలవారిపల్లి పంచాయతీలో విస్రృతంగా పర్యటించి అధికారులకు ఏర్పాట్లుపై పలు సూచనలు చేశారు.

మదనపల్లిలో గురువారం సాయంకాలం ముస్లీం సోదరులకు స్థానిక ఎన్.వి.ఆర్ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు.

ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో వస్తున్నందున స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెలిపాడ్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం కలెక్టర్ ఈ ప్రాంతాలలో పర్యటించి ఏర్పాట్లును పరిశీలించి అధికారులరు పలు సూచనలు చేశారు.

11 స్టార్స్  గ్రామంగా చండ్రమాకలపల్లి

ముఖ్యమంత్రి నవనిర్మాణ ధీక్షలో భాగంగా చండ్రమాకులపల్లి పంచాయతీలో పర్యటిస్తారు.గ్రామంలోని ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతారు.

చండ్రమాకులపల్లి ఎస్.సి, బి.సి కాలనీలలోని వీధులలో సి.ఎం పర్యటిస్తారు. ఎల్.ఇ.డి వీధి దీపాలను, బృందావనమును సి.ఎం ప్రారంభిస్తారు.గ్రామంలోని ప్రజలందరికి మరుగుదొడ్డి, తాగునీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, నెలకు రూ.10వేలు ఆదాయం, పైబరి గ్రిడ్ ఏర్పాటు, గ్రామంలో సి.సి రోడ్లు, అందరకి ఆరోగ్యం, మహిళలపై అఘాయిత్యాలుకు జరగని విధఁగా గ్రామాన్ని తయారు చేసినందున అక్కడి ప్రజలతో సి.ఎం ముఖాముఖి నిర్వహిస్తారు. అంగన్ వాడీలో టి.వి, పాఠశాలకు ప్రహారీ గోడ, డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకొన్నారు.

కలెక్టర్ గ్రామంలోని ప్రజల స్థితిగతులను ఆగ్రామ సర్పంచ్ ద్వారా అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలోని ప్రజలు పానీపూరి వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని కలెక్టర్కు తెలపగా, వెంటనే వారు గ్రామానికి సి.ఎం. కార్యక్రమంలో పాల్గోని వారి వ్యాపారాల కోసం రుణాలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్నసమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకొని వెంటనే వారి ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వలసపల్లిలో ఉన్న జవహర్ నవోదయ పాఠశాల మైదానంలో సి.ఎం బహిరంగ సభ నిర్వహించనున్నారు.

సి.ఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

గురువారం సి.ఎం. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లును కలెక్టర్ ప్రదుమ్నతో పాటు జె.సి గిరీష్, ఎస్.పి రాజశేఖర్ బాబు, జె.సి-2 వి.ఆర్ చంద్రమౌళి, ఇన్-చార్జీ సబ్-కలెక్టర్ సి.గుణభూషణ్ రెడ్డి, డ్వామా పి.డి కూర్మనాథ్, పలమనేరు డి.ఎస్.పి చౌడేశ్వరీ, గృహనిర్మాణ పి.డి రామచంద్రారెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్.ఇ వేణు,సిరికల్చర్ జెడి అరుణ కుమారి, జెడ్.పి సి.ఇ.ఓ రవికుమార్,డిపిఓ సురేష్ నాయుడు, డి.ఎల్.పి.ఓ లక్ష్మీ, పుంగనూరు ఎం.పి.డి.ఓ లక్ష్మిపతి నాయుడు, తాహిసీల్దార్, టిడిపి జిల్లా అధ్యక్షుడు పులువర్తి నానీ, పుంగనూర్ టిడిపి ఇన్-చార్జీ వెంకటరమణరాజు, శ్రీనాధరెడ్డి తదితరులు పాల్గోన్నారు.