క్లాస్‌రూంలో టీచర్లకు భయపడేవాడిని – కర్ణాటక సీఎం కుమారస్వామి

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
తాను చిన్నతనంలో తరగతిగదిలో ఉపాధ్యాయులకు భయపడేవాడినని, తాను చదువులో మొద్దునని, అందుకే తాను చివరి బెంచ్‌లో కూర్చొనేవాడినని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి అన్నారు.జయానగర్‌లోని నేషనల్‌ డిగ్రీ కళాశాలలో కుమారస్వామి విద్యనభ్యసించారు.

ఆ కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఘన౦గా నిర్వహించారు.ఈ ఉత్సవానికి కళాశాల యాజమాన్యం కుమారస్వామిని ఆహ్వానించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత కుమారస్వామి కళాశాలకు వెళ్లారు. అక్కడ ఆయన్ని సన్మానించారు.ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ నేను కాలేజీలో చదివే రోజుల్లో రాజ్‌కుమార్‌కు వీరాభిమానిని.

నా చదువును కొనసాగించి ఉంటే ఐఏఎస్‌ అధికారిని అయ్యేవాడిని. కానీ నా జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. నువ్వెందుకూ పనికిరావు అంటూ నాన్న నన్ను ఎప్పుడూ తిడుతుండేవారు. కానీ నేను ఎలాగోలా రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. ఎంపీగా గెలిచినప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చాలా కష్టపడ్డాను.

రాజకీయాల్లో నేను అదృష్టవంతుడినని భావిస్తాను. కాలేజీ రోజుల్లో బాధ్యత లేకుండా తిరిగేవాడిని. చదువులో మొద్దుని. ముందు బెంచ్‌లో కూర్చుంటే ఎక్కడ టీచర్లు నన్ను ప్రశ్నలు అడుగుతారోనని వెనక కూర్చునేవాడిని. కానీ ఇప్పటి విద్యార్థులు అలా చేయొద్దు. బాధ్యతగా నడుచుకోండి. విధాన సౌధకు ఎప్పుడైనా వచ్చి విద్యార్థులు నన్ను కలవొచ్చు. నన్ను కలవడానికి అనుమతి, అపాయింట్‌మెంట్‌ అవసరం లేదు. సీఎంను కలవాలని చెప్పి రండని వెల్లడించారు కుమారస్వామి.

advertisment