టీటీడీ వివాదం ఆపరేషన్ గరుడలో భాగమేనా?

0
326

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత సడెన్‌గా రమణ దీక్షితులు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులును ఉన్నట్టుండి టీడీపీ రిటైర్మెంట్ పేరుతో తొలగించింది. అంత తొందరగా, ఎప్పుడూ లేని విధంగా రిటైర్మెంట్ పేరు చెప్పి తొలగించాల్సిన అవసరం టీడీపీ ప్రభుత్వానికి ఏమొచ్చింది? టీడీపీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం రమణ దీక్షితులు వెనక బీజేపీ ఉందనేది ప్రధాన ఆరోపణ.

మరి బీజేపీకి ఆ అవసరం ఎంత వరకు ఉంది? ఏపీలో టీడీపీని రాజకీయంగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత బీజేపీకి ఉందనే మాట నిజమే. అయితే టీడీపీ చెబుతున్నదాని ప్రకారం టీటీడీ వ్యవహారాన్ని బీజేపీ కావాలనే ఎంచుకుందనుకుంటే అందుకు గల కారణం హిందుత్వమేనని భావన కనిపిస్తుంది.

ఆర్ఎస్ఎస్‌కు అనువంశికంగా ఉండే  బీజేపీకి సహజంగానే హిందూ అనుకూల పార్టీ అనే పేరు ఉంది. అదే బిజెపికి అనుకూలమైంది. దేశంలో అధికారంలోకి రావడానికి ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు ఉత్తరాదిన హిందుతత్వమే బిజెపికి ఓటు బ్యాంకు గా మారింది.

దీంతో బిజెపి హిందుతత్వ కోణంలో నే ఏపీలో టీడీపీని ఎదుర్కోవాలనే ఆలోచనతోనే టిటిడి వివాదాన్ని అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు కనబడుతోంది.

అయితే మరికొంతమంది వాదన ప్రకారం ఒక్క ఏపీనే కాదు దక్షిణాదిపై పెత్తనం కోసం ఆద్యాత్మిక మార్గం (హిందుతత్వ ఎజెండా) ద్వారా ముందుకెళ్లాలనేది బీజేపీ ప్లాన్ గా భావిస్తున్నారు. అంటే దక్షిణాదిపై పెత్తనం చెలాయించేందుకు బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగమే ఆపరేషన్ గరుడ . ఇది ఈ మధ్య బాగా పాపులర్ అయింది.

ఇదిలా ఉంటే బీజేపీ వాదన మాత్రం మరోలా ఉంది. టీటీడీ నిధులను ఏపీ ప్రభుత్వం సొంతానికి వాడుకుంటుంది. చంద్రబాబు తన అనుయాయులను టీటీడీలోకి ఏదోక పదవిని అప్పగించి, వారి ద్వారా తన పని కానిస్తున్నట్లు బిజెపి అనుమానం.

టిటిడి పాలక వర్గం అనేది రాజకీయ పునరావాస కేంద్రం మారి, అక్కడి అధికార పార్టీలది టీటీడీలో  పెత్తనం పెరగడం, అవినీతి పెచ్చు మీరుతోందని బిజెపి కేంద్ర నాయకత్వం భావన.

రాజకీయ నేపథ్యం, అధికార పార్టీల అండగల పాలక వర్గాల ద్వారా  దేవుని సొమ్మును పార్టీ ఫండ్‌ లకు మరో మార్గంలో మళ్లీస్తు, రాజకీయ అవసరాలకు టిటిడిని,ఆ దేవదేవుడి సొమ్మును వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని బిజెపి వాదన.

అయితే, టిటిడి పాలక వర్గం అనేది ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లోని రాజకీయ నిరుద్యోగులకు అవకాశం ఇవ్వడం రివాజు.

రమణ ధీక్షతులు భయటకు వచ్చి మరో కొత్త అనుమానాలకు తావిచ్చారు. దేవుడి సొమ్మునే కాదు. ఆదేవదేవుడి నగలు, వాటి లెక్కలపైన సైతం సామాన్యుడిలో అనుమానం కల్గించారు.

రమణ దీక్షితులు చెబుతున్న దాని  ప్రకారం వెంకటేశ్వర స్వామి వారి పురాతన నగల లెక్కలు లేవని,అప్పట్లో విరాళంగా వచ్చిన డైమెండ్‌ ఇప్పుడు దేవుని వద్ద లేదని.. దేవాలయం నుంచి దొంగలించబడి..స్వీట్జర్లాండ్ రాజధాని జెనివాలో వేలం వేయబడిందని ఆరోపిస్తున్నారు.

అదే నిజమైతే ఎంత అపచారం…దేవుడి నగలకే కన్నం వేశారంటే…దేవుడి సంపద ఎంత పక్కదారి పట్టి పట్టిందోననే   అనుమానం ఏలాంటి భక్తుడికైనా రాక మానదు. దీని వెనుక టిడిపి నేతల హస్తం ఉన్నదనే రాజకీయ విమర్శలు కూడ వచ్చాయి.

ఇప్పుడు దేవుడికే రక్షణ లేదా అనే అనుమానం సామాన్య భక్తులలో కల్గుతోంది. ఇందులో వాస్తవమెంతో తెలుసుకోవాలంటే..ప్రభుత్వం విచారణ చేయించి నిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణల వెనక నిజమెంత? రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలలో పస లేదని నిరూపించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే..

అయితే ఏదొకటి తేలాలంటే మాత్రం అటు ఆ ఆరోపణలపై విచారణైనా జరిపించాలి లేదా అవన్నీ తప్పని టీడీపీ ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ టీటీడీ వివాదంలో నిజా నిజాలు తేలాలంటే ప్రస్తుతానికి విచారణే మార్గంగా కనిపించినప్పటికీ అందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు.

ఈ పరిస్థితులలో కేంద్రం ఆపరేషన్ గరుడులో భాగంగా టిటిడి నిధులు- నగలు-ఇతర వివాదాలపై కేంద్రం స్పందించి రమణదీక్షితుల ఫిర్యాదు ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా అనేది సందేహంగా మారింది.

అదే జరిగితే వివాదం మరో మలుపు తిరిగి రాష్ట్రంలో రాజకీయ సుడి గుండం ఏర్పడే అవకాశం ఉందా..అనేది వేచి చూద్దాం…