భారీగా తగ్గిన బంగారం ధరలు

0
264

మనఛానల్ న్యూస్ – బిజినెస్
బంగారం ధర మళ్లీ భారీగా తగ్గింది. సోమవారం 10గ్రాముల బంగారం రూ.405లు తగ్గడంతో కొనుగోలు ధరలు పరుగులు తీస్తున్నారు. .ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.32వేల దిగువకు పడిపోయింది.

బులియన్‌ ట్రేడింగ్‌లో స్వచ్ఛమైన 10గ్రాముల పసిడి రూ.31,965కు చేరింది. మరోపక్క వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి రూ.370 తగ్గడం ద్వారా రూ.41వేల మార్కును కోల్పోయి, రూ.40,830 పలుకుతోంది. అననుకూల అంతర్జాతీయ పరిణామాలు సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో బంగారం కొనుగోలుకు మదుపరులు అంతగా ఆసక్తి చూపలేదు.

అంతర్జాతీయంగా 0.30శాతం తగ్గిన పసడి ధర ఔన్సు 1,296.20 డాలర్లుగా ఉంది. వెండి కూడా 0.36శాతం తగ్గి ఔన్సు 16.51డాలర్లకు చేరింది.మార్కెట్లో రోజు రోజుకు బంగారు ధరలలో నిలకడ లేకపోవడంతో మార్కెట్లో పరిస్థితి అయెమయంగా మారింది.