
మనఛానల్ న్యూస్ – హైదరాబాద్
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్యనటుడు నందమూరి తారకరామరావు జయంతిని పురష్కరించుకొని నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.
వీరితోపాటు ప్రముఖులు కూడా ఆయనకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, మనవలు జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తదితరులు ఆయనకు నివాళులర్పించారు.
ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న వారంతా ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్ఫాలు ఉంచి నివాళులర్పించారు. దర్శకుడు క్రిష్ కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.