తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం – 11 మంది మృతి

0
518

 మనఛానల్ న్యూస్ – హైదరబాద్

తెలంగాణాలో సిద్ధపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై శనివారం ఒకే మారు నాలుగు వాహనాలు ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగింది.

సినిమాలో మాదరి జరిగిన ఈ సంఘటనతో స్థానికుల బెంబేలు ఎత్తిపోయారు. ఎమి జరుగుతుందో అర్థం కాక వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళన చెందారు.

ఆర్టీసీ బస్సు, కంటెయినర్, లారీ, క్వాలిస్ వాహనాలు ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. మంచిర్యాల డిపోకు చెందిన రాజధాని బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది.

లారీ, కంటెయినర్ మధ్య క్వాలిస్ వాహనం చిక్కుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

పోలీసులు, వైద్యసిబ్బంది, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రహదారిపై వాహనాల రాకపోకలను పునరుద్దరణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఈ సంఘటనపై ఆరా తీశారు.

ఈ రోడ్డు ప్రమాద ఘటన పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు