అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ డైరెక్టర్‌గా గీనా హాస్పల్‌

0
266

మనచానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరక్టర్‌గా 61 ఏళ్ల గీనా హాస్పల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అత్యంత క్రూరంగా ఇంటరాగేషన్ టెక్నిక్స్‌ను వాడుతుందన్న ఆరోపణలను ఆమెపై ఉన్నాయి. కానీ అమెరికా సేనేట్ మాత్రం సీఐఏ డైరక్టర్ పదవిని ఆమెకే అప్పగించనున్నట్లు తేల్చింది. ప్రస్తుతం ఆమె సీఐఏ యాక్టింగ్ డైరక్టర్‌గా ఉన్నారు. అయితే మొదటిసారి సీఐఏకు ఓ మహిళ డైరక్టర్ కానున్నారు. సేనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో హాస్పల్‌కు అనుకూలంగా 51-43 ఓట్లు పోలయ్యాయి. హాప్పల్‌పై రిపబ్లికన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా.. చివరకు ఆమెనే సీఐఏ డైరక్టర్‌ను చేశారు.