తిరుమల తిరుపతి దేవస్థానంలో నలుగురు కొత్త ప్రధాన అర్చకులు

0
70
advertisment

మనచానల్‌ న్యూస్‌ – తిరుమల
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నలుగురు కొత్త ప్రధాన అర్చకులు నియమితులయ్యారు.ఈ మేరకు టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.

అనూహ్య పరిణామాల మధ్య గొల్లపల్లి వంశం నుంచి రమణ దీక్షితులకు బదులుగా వేణుగోపాల దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులు, పైడిపల్లి కుటుంబం నుంచి కృష్ణ శేషాచల దీక్షితులను నియమించారు.ఎ

న్నో ఏళ్ల తర్వాత టీటీడీ సరికొత్త శకానికి శ్రీకారం చుట్టింది. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుల పాత్ర ప్రత్యేకమైంది. స్వామివారి కైంకర్యాల్లో అత్యంత కీలకమైన బాధ్యతలు ప్రధాన అర్చకులు నిర్వహిస్తారు. రమణదీక్షతుల వ్యవహారంతో శరవేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీటీడీ నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది.

వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయంలో, శ్రీనివాస దీక్షితులు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తారు.