లాంచీ ప్రమాదంలో గల్లంతైన 19 మృతదేహాలు వెలికితీత

0
33
advertisment

– మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం ప్రకటి౦చిన సీఎం చంద్రబాబు
– మిగిలిన మృతదేహాల కొరకు గాలింపు చర్యలు ముమ్మరం
మనచానల్‌ న్యూస్‌ – తూర్పుగోదావరి
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ ము నిగిన ప్రమాదంలో 22 మంది మృతిచెందారు. మంగళవారం సాయంత్రం ఈదురుగాలుల వర్షం తాకిడికి లాంచీ తిరుగబడి మునిగిపోయిన విషయం తెలిసిందే. వాడపల్లి సమీపంలో పడవ కూరుకుపోయినట్టు బుధవారం ఉదయం అధికారులు గుర్తించారు.

రాత్రివరకు 19 మృతదేహాలను వెలికితీశారు. మరో మూడు మృతదేహాల కోసం నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.ప్రమాద సమయంలో లాంచీలో మొత్తం 44మంది ఉండగా, 22 మంది సురక్షితంగా బయటపడ్డారు. మృతులంతా దేవీపట్నం, పోలవరం, రంపచోడవరం, కొత్తగూడెం గ్రామాలకు చెందినవారు. మృతుల్లో ఇద్దరు కవలలు ఉన్నారు.

తమవారికోసం మంగళవారం రాత్రి నుంచి ఎదురుచూసినవారు మృతదేహాలను చూసి బోరున విలపించారు. మృతదేహాలకు అక్కడే వైద్యులు పోస్టుమార్టం చేశారు. 45 అడుగుల లోతున ఇసుకలో కూరుకుపోయిన లాంచీని ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ సిబ్బంది బోట్లు, భారీక్రేన్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు.

లాంచీలో రవాణా చేస్తున్న సిమెంట్ బస్తాలు మృతుల సంఖ్య పెరుగడానికి కారణమని తెలుస్తున్నది. విపరీతమైన గాలితో వర్షపు నీరు లోపలకు వస్తుండటంతో లాంచీలోని సిమెంట్‌బస్తాలు తడవకుండా చుట్టూఉన్న తలుపులు మూసివేశారు. అదేసమయంలో లాంచీ తిరుగబడింది.

తలుపులువేసి ఉండటంతో ప్రయాణికులెవరూ బయటకు రాలేక అందులోనే సమాధి అయ్యారు. లైఫ్‌జాకెట్లను కట్టకట్టి ఒక మూలన పడేసినట్టు సమాచారం.