నిరుద్యోగులకు శుభవార్త …

0
55
advertisment

మనఛానెల్ న్యూస్ – ఎడ్యుకేషన్ డెస్క్

 

నిరుద్యోగులకు శుభవార్త …

నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్ర ఫౌండేషన్ శుభవార్త తెలిపింది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి 2016 -18 మధ్యకాలంలో ఇంజినీరింగ్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగ యువతీ యువకులకు ‘టెక్ మహీంద్ర ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నైపుణ్యశిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఫౌండేషన్ మేనేజర్ ఎం.సుధీర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
శిక్షణ కోసం ఎంపికైనవారికి నామమత్రపు ఫీజుకే వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి..అనంతరం వారికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అభ్యర్థులు మే 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోని నీలగిరి బ్లాక్‌లో ఉన్న తమ శిక్షణ కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు 76759 14735 ఫోన్ ‌నెంబరులో సంప్రదించాలని కోరారు.
అభ్యర్థుల ఆసక్తి, అర్హతను బట్టి వారికి డిజిటల్ మార్కెటింగ్, ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ డిజైన్, పీహెచ్‌పీ, హెచ్‌టీఎంఎల్, బిజినెస్ ఇంగ్లిష్, సీఎస్‌ఎస్, బూట్‌స్ట్రాప్ వంటి కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
శిక్షణ అనంతరం వీరికి వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.