బిజెపి మోసంపై ఎబివిపి దారేటు – ప్రశ్నించిన టి.ఎన్.ఎస్.ఎఫ్

0
151
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
ఆంధ్ర ప్రదేశ్ విషయంలో బిజెపి మోసపూరిత చర్యలను ఎబివిపి ఎందుకు ప్రశ్నించడం లేదని టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్పురి రమేష్ ప్రశ్నించారు. రాష్ట్రానికి బిజెపి  ఇంత అన్యాయం చేస్తున్న ఎబివిపి విద్యార్థి సంఘం ఏ మాత్రం స్పందించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.

దీనివల్ల రాష్ట్రంలోని వేలాది విద్యార్థులు భవిష్యత్ లో ఎంతో నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికార పార్టీ బిజెపికి అనుకూలమైన ఎబివిపి రాష్ట్ర ప్రయోజనాలకోసం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా ఉండడాన్ని ఆయన ప్రశ్నించారు.

ఎబివిపి ఎపి ప్రజలకు అనుకూలమా? వ్యతిరేకమా ? అనేది తెల్చుకోవాలని ఆయన అన్నారు. గతంలో ఎబివిపి నేతలు రాష్ట్రం కోసం అవసరమైతే కేంద్రంలోని బిజెపి నేతలను ప్రశ్నిస్తామని ప్రగల్బాలు పలికి నేడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని అన్నారు.