ఆఫ్రికాలో మళ్లీ ఎబొలా ఛాయలు – 17 మంది మృతి

0
35
advertisment

మనచానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వ్యాధి ఎబొలా ఛాయలు మళ్లీ ఆఫ్రికా ఖండంలో కనబడుతున్నాయి. ఇది ప్రాణాంతకమైన వ్యాధి.జాగా ఈ వ్యాధి బారిన పడి కాంగోలో 17 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కాంగో ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. కాంగోలో భూమధ్యరేఖ ప్రాంతంలో 21 కేసులు నమోదవగా వీరిలో 17 మంది మృతి చెందారు.

ఈ ప్రాణాంతక వ్యాధి కాంగోను 1976 నుంచే పట్టి పీడిస్తోంది. ఇది క్రమంగా ప్రపంచ దేశాలకు వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వ్యాధిని తొలిసారిగా జైర్‌ ప్రాంతంలో బెల్గెన్ నేతృత్వంలోని బృందం కనుగొన్నది.ఎబోలా మళ్లీ విజృంభించడంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఒ కాంగో ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఎబోలాను నియంత్రించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని సిద్ధం చేసింది.

2017లోనూ ఎబోలా విజృంభించిన సమయంలో డబ్ల్యూహెచ్‌ఒ అప్రమత్తమై సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడంతో దానిని నియంత్రించగలిగారు. ఎబోలా నియంత్రణకు గాను 840,000 యూరోలు విడుదల చేసినట్లు డబ్ల్యూహెచ్‌ఒ ప్రకటించింది. 50 మంది ప్రత్యేక వైద్య నిపుణులను కాంగోకు పంపినట్లు తెలిపింది.