ప్రమాదవశాత్తు సాంబారు పాత్రలో పడి బాలుడి దుర్మరణం

0
30
advertisment

మనచానల్‌ న్యూస్‌ – మంత్రాలయం
ప్రమాదవశాత్తు సాంబారు పాత్రలో పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మంత్రాలయం మండలం ఊదూరు గ్రామానికి చెందిన నరేష్ శుక్రవారం తల్లిదండ్రులతో కలిసి ఎమ్మిగనూరు మండలం పరమాన్ దొడ్డి గ్రామంలో జరుగుతున్న బంధువుల పెళ్లికి వెళ్లాడు.

తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ మూత మూసిన సాంబార్ పాత్రపై కూర్చున్నాడు. అదే సమయంలో మూత పక్కకు జరగడంతో నరేశ్‌ గిన్నెలో పడిపోయాడు. సాంబారు వేడిగా ఉండటంతో బాలుడి శరీరం బాగా కాలిపోయింది.

దీంతో తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవటంతో ప్రైవేటు ఆస్పపత్రుల చుట్టూ తిరిగారు. చివరకు కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ వేకువజామున మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.