కర్ణాటక ఎన్నికల బరిలో 2655 మంది అభ్యర్థులు

0
34
advertisment

మనచానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
దక్షిణాది రాష్ట్రాల్లో ఒకికి పేరొందిన కర్ణాటక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అధికార కాంగ్రెస్‌, భాజపాతో పలు పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తించారు.కాగా ఈ సారి ఎన్నికల్లో మొత్తం 2,655 మంది బరిలోకి దిగారు. వీరిలో 219 మంది మహిళలున్నారు.

ఏప్రిల్‌ 24 బుధవారంతో నామినేషన్లు వేసేందుకు గడువు ముగిసింది. మొత్తం 3,509 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన అధికారులు 271 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన ఏప్రిల్‌ 27 శుక్రవారం 583 మంది పోటీ నుంచి తప్పుకున్నారు.

దీంతో మొత్తం 2,655 మంది బరిలో నిలిచారు.వీరిలో భాజపా నుంచి 224 మంది(అన్ని నియోజకవర్గాల్లో ఈ పోటీ చేస్తుంది), కాంగ్రెస్‌ నుంచి 222 మంది పోటీలో ఉన్నారు. జేడీఎస్‌ నుంచి 201, బీఎస్పీ నుంచి 18 మంది బరిలోకి దిగుతున్నారు. మిగతా పార్టీలకు చెందిన వారు 800 మంది కాగా.. 1155 మంది స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో 2436 మంది పురుషులు, 219 మంది మహిళా అభ్యర్థులున్నారు.

కర్ణాటకలో మొత్తం 224 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటన్నింటికీ ఒకే దశలో మే 12న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 15న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో 4.9కోట్ల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అటు భాజపాకు, ఇటు కాంగ్రెస్‌కు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.