శిల్పారామంలో 28, 29న ”ఇండియన్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌”

0
37
advertisment

మనచానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ప్రపంచా నృత్య దినోత్సవాన్ని పురష్కరించుకొని మాదాపూర్‌లోని శిల్పారామంలో ఈనెల 28, 29న ఇండియన్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాట్యమిత్రం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ హిమబిందు ఖనౌజ్‌ తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని శిల్పారామం, నాట్యమిత్రంలు సంయక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆమె అన్నారు. ఈ సందర్భంగా శిల్పారామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు.

రెండురోజలు నిర్వహిస్తున్న డ్యాన్స్ ఫెస్టివల్‌లో ప్రముఖ నాట్యగురువుల ఆధ్వర్యంలో వారి శిష్య బృందాలు కూచిపూడి, భరతనాట్య, జానపద న్యత్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ, శ్రీవల్లి, అనూష, వైష్ణవిలు పాల్గొన్నారు.