ఫిలిం చాంబర్ వద్ద పవన్ కళ్యాణ్, నాగబాబు నిరసన

0
98
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు శుక్రవారం ఫిలించాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి అనే సినీ నటి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ..ఆయన తల్లి గురించి పరుషదాలు ఉపయోగించింది.

దీనిపై ఇటివల నాగబాబు తీవ్రంగా ఖండించారు. వెంటనే శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లికి క్షమాపణలు కోరుకొంది. అయినా మీడియా లో శ్రీరెడ్డి వివాదాన్ని పదే పదే మీడియా టి ఆర్ పి రేటింగ్ల కోసం సాగదీత చేస్తూ..టాలీవుడ్ ను మరింత వివాదస్పదం చేయడాన్ని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా విమర్సిస్తూ ..శుక్రవారం తన సోదరుడు నాగబాబుతోకలిసి ఫిలించాంబర్ కు వచ్చి దీనిపై తీవ్ర నిరసన తెలియచేశారు.

మీడియా తీరును తప్పుపట్టారు. శ్రీరెడ్డి వివాదాన్ని రాజేస్తున్న శక్తులు ఎక్కిడివో తనకు తెలుసునని అన్నారు.
శ్రెరెడ్డి తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదని, తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, అవకాశాలు అడిగితే లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, కాస్టింగ్ కౌచ్ వ్యవస్థ పట్ల నిరసన తెలియచేశారు.

శ్రీరెడ్డి రేపిన వివాదం అదుపు తప్పింది. చివరికి తెలుగుపరిశ్రమను ఓ కుదుపు కుదిపేసింది. ప్రధానమైన కొన్ని కుటుంబాలకు ఈ సమస్య తలనొప్పిగా తయారైంది.

దీనిని సరైన మార్గంలో పరిష్కరించే వారు లేక సతమతమౌతున్నారు. దాసరి నారాయణ రావు లాంటి సినిదిగ్గజాలు లేని వెలితిని పరిశ్రమ తీవ్రంగా ఎదుర్కొంటోంది.