గుజరాత్ లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన బి.టెక్,ఎం.బి.ఎ అభ్యర్థులు

0
72
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవడానికి గుజరాత్ లో జరిగిన పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ద్వారా ఎంపికైన యువత విద్యార్హతలు చూస్తే అర్థమౌతుంది.

ఇంజనేరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎం.బి.ఎ, బి.సి.ఎ, ఎం.ఎస్.సి వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారు సైతం పోలీసు కానిస్టేబుల్స్, జైలు సిపాయి ఉధ్యోగాలకు ఎంపికయ్యారంటే ఆశ్చర్యమేస్తోంది.

ప్రైవేటు ఉద్యోగాలకంటే ప్రభుత్వంలో కింది స్థాయి ఉద్యోగమైనా చాలు అనే దోరణి ఉన్నత విద్యావంతులలో రావడం విద్యావిధానంలో లోపమా ??? యువతలో ఇది ఏ మార్పును సూచిస్తుంది???  అయితే సాంకేతిక విద్య, మేనేజేమెంట్ విద్యను అభ్యసించే విద్యార్థులలో తెలియని అభద్రత భావాన్ని కల్పిస్తున్నట్లు మానసిక నిపుణలు విశ్లేషిస్తున్నారు.

గుజరాత్ లో ఎల్‌ఆర్‌డీ (లోక్ రక్షక్ దళ్) ఎంపికైన 17,532 మంది జవాన్లలో 50 శాతం మందికి పైగా గ్రాడ్యుయేట్లు లేదా పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీలు ఆపై విద్యను అభ్యసించినవారే ఉన్నారని 2017 ఎల్‌ఆర్డీ రిక్రూట్‌మెంట్‌ చైర్మన్‌, వడోదర రేంజ్‌ ఐజీపీ జీఎస్‌ మాలిక్‌ చెప్పారు.

గుజరాత్ లో 2017లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్, జైల్ సిపాయి రిక్రూట్ మెంట్లో ఎంపికైన 1000 మందిలో బి.సి.ఎ చదివినవారు 458 మంది, బి.ఇ లేదా బి.టెక్ చదివినవారు 341 మంది, బి.ఎస్.సి మరియు ఎం.ఎస్.సి (ఐటి) చేసినవారు 49 మంది, ఎం.సి.ఎ చేసినవారు 29మంది, ఎం.ఇ లేక ఎం.టెక్ చేసినవారు ఇరువురు,ఇతర డిగ్రీ కోర్సులు చేసినవారు 25మంది ఉన్నారు.