ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6 న జాతీయ రహదారులపై పాదయాత్ర

0
94
advertisment

మనఛానల్ న్యూస్ – అమరావతి
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జనసేన, వామపక్షపార్టీలు ఈ నెల 6న జాతీయ రహదారులపై పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు బుధవారం వెల్లడించారు.

బుధవారం వామపక్షాల నేతలతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో  చేపట్టవల్సిన కార్యచరణ పై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వామపక్ష పార్టీ నాయకులు మదు, లక్ష్మీనారాయణతో కలిసి సంయుక్తంగా విలేఖర్ల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈనెల 6వ తేదిన ఊరూరా ఉదయం 10 గంటల నుంచి పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. వివిధ ప్రాంతలలో విభజన సమస్యలపై చర్చా వేదికలు నిర్వహిస్తామని తెలిపారు. వామపక్ష పార్టీలతో కలిసి ఉద్యమాలు చేస్తామని  పవన్ వివరించారు.