గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా శిబిరాలు

0
105
advertisment

మనచానల్‌న్యూస్‌ – చిత్తూరు
చిత్తూరుజిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్న గ్రంథాలయాల్లో ఏప్రిల్‌ 25 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమ ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అర్హులని ఆమె తెలిపారు.

ఉదయం 8 నుంచి 12 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. పుస్తక పఠనం, కథలు చెప్పడం, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, డ్రాయింగ్‌, పెయి౦టి౦గ్‌, అల్లికలు, కుట్లు, సంగీతం, నాటికలు, డ్యాన్స్‌ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థినీ, విద్యార్థులు ఏప్రిల్‌ 9వ తేది నుంచి 20వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఇతర వివరాలకు 7995012490, 7013740125, 08572-233449 అను ఫోన్‌ నెంబర్లను సంప్రదించవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.