మే19న ఘనంగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ వివాహం

0
139
Britain's Prince Harry poses with Meghan Markle in the Sunken Garden of Kensington Palace, London, Britain, November 27, 2017. REUTERS/Toby Melville
advertisment

ప్రిన్స్ వెడ్డింగ్ కార్డును ప్రింట్ ఈ మిషన్ లోనే ముద్రించారు

మనఛానల్ న్యూస్ – ఇంటర్నేషనల్ డెస్క్
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ మరియు మేగాన్ మార్క్‌ల ల వివాహం మే 19న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుచున్నాయి. ఈ పెళ్లికి 600 మంది ముఖ్య అతిథులకు త్వరలో అధికారిక ఆహ్వానాలను అందజేయనున్నారు.బ్రిటన్ రాజప్రసాదం కెన్సింగ్టన్ ప్యాలెస్ గురువారం వివాహ వార్తలను ధ్రువీకరించింది.

యువరాజు విహహా ఆహ్వాన పత్రిక ముద్రణకు ఎన్నో జాగత్రలు తీసుకొన్నారు. రాజరికానికి తగిన విధంగా కార్డులు ముద్రణ చేశారు. ఇంగ్లీష్ కార్డుపై అమెరికన్ సిరాను ఉపయోగించడమేగాక వీటిని బార్నార్డ్ మరియు వెస్ట్‌వుడ్ ముద్రించిన ఆహ్వానాలు అదుర్స్.

వివాహం యు.కెలోని విండ్సర్‌లో విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్ లో జరగుతుందని రాజప్రసాదం ఇప్పటికే వెల్లడించింది.

advertisment

వివాహ వేడుకకు హాజరైన అతిథులకు ప్రత్యేకంగా రూపొందించిన ఏకరీతి డ్రెస్ కోడ్ ను పెట్టినట్లు తెలుస్తోంది. అతిథులు ఉదయపు వేళ కోటు లేదా పొడువైన సూట్ మరియు పగలు డ్రెస్ మరియు ఒక టోపి ధరించే విధంగా ఏర్పాట్లు చేశారు.

యువరాజు ప్రిన్స్ హ్యారీ తొలుత బ్రిటీష్ సైన్యంలో సైనికుడు గా పనిచేశారు. ప్రస్తుతం రాయల్ మెరైన్స్ లో కెప్టెన్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు.

యువరాజు పెండ్లి కార్డుల ముద్రణ కోసం రాజప్రసాదంలోని 1930 నాటి ప్రింటింగ్ మిషన్ ను వినియోగించారు.

వివాహ ఆహ్వాన పత్రికలలో ప్రిన్స్ హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ పేరును బంగారుపూత అక్షరాలతోను మిగిలినవి అక్షరాలు నల్లటి అక్షరాలతో ముద్రణ చేశారు. పత్రిక చూడడానికి ఎంతో కాంతివంతంగా ఉండి కార్డు చుట్టు బంగారు పూత అంచు ఉంటుంది. యువరాజు హ్యారీ మరియు మిస్ మేఘన్ మార్క్లేల వివాహా ఆహ్వానాలు ది వేల్స్ యువరాణి పేరుతో ముద్రించారు.

ఈ అద్భుతమైన వివాహా ఆహ్వానాలను ముద్రించే బాధ్యతను లాటరీ స్మాల్‌కు ఇవ్వబడింది, ఇటీవల ఆమె ప్రింటర్లతో తన శిక్షణను పూర్తి చేసింది.

1792 నాటి రాజప్రసాదంలోని ఫ్రాగ్మోర్ హౌస్ లో ప్రిన్స్ హ్యారీ మరియు మార్కేల్ ఫోటో సెషన్ ను 2017 నవంబర్‌లో అధికారిక నిశ్చితార్థం సమయంలో పూర్తి చేశారు.