ఆసీస్‌ అంటే ఐసీసీకి ఎందుకంత ప్రేమ..?

0
63
advertisment

మనచానల్‌న్యూస్‌ – స్పోర్ట్స్‌డెస్క్‌
సాధారణంగా అంపైర్‌కానీ, ఇతర ఆగాళ్లపై దురుసుగా ప్రవర్తిస్తే వారిపై వెంటనే ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) తీవ్రచర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఈ కఠిన నిబంధనలను ఆస్ట్రేలియా జట్టుపై మాత్రం అమలు చేయడం ఐసీసీ వెనుకాడుతోంది. అయితే ఐసీసీకి ఆసీస్‌ జట్టంటే ఎందుకంత ప్రేమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రత్యర్థి ఆటగాడిని స్లెడ్జింగ్‌ చేస్తే నిస్సంకోచంగా వేటు వేస్తారు..! అలాంటిది క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోయేలా.. సగటు అభిమాని తలదించుకునేలా..క్రీడాస్ఫూర్తి మంటగలిసేలా.. ఆటలో ఓడించలేని ప్రత్యర్థిని దొంగ దెబ్బతీయాలని.. నిస్సిగ్గుగా జట్టంతా కలిసి బాల్‌ టాంపరింగ్‌ చేస్తే ఏం చేయాలి..! ఎంత కఠినంగా శిక్షించాలి..! కానీ, దీనికి సూత్రధారి ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్మిత్‌పై కేవలం ఒక టెస్ట్‌ నిషేధం, పాత్రధారి బాన్‌క్రా‌ఫ్ట్‌పై జరిమానాతో సరిపెట్టేశారు..! పైగా వైస్‌ కెప్టెన్‌ వార్నర్‌పై అసలు చర్యలే లేవు. ఆస్ట్రేలియా జట్టుపై ఐసీసీ చూపిన అవ్యాజమైన అనురాగమిది. చిన్నతప్పులకే జరిమానాలని.. డీమెరిట్‌ పాయింట్లని మిగతా దేశాలపై కఠినంగా వ్యవహరించే ఐసీసీ.. ఆసీస్‌ విషయానికి వచ్చేసరికి ఔదార్యం చూపుతోంది..! ఒకప్పుడు బంతికి అంటుకున్న మట్టి తుడిచినందుకే సచిన్‌పై మ్యాచ్‌ నిషేధం వేసి అత్యుత్సాహం ప్రదర్శించిన ఐసీసీకి కంగారూలంటేనే ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది. మంకీగేట్‌ వివాదంలో దోషిగా తేలకున్నా హర్భజన్‌పై మూడు నెలల వేటు.. ఇదే ఆస్ట్రేలియాతో ఇటీవలి సిరీ్‌సలో స్మిత్‌ను భుజంతో తాకాడన్న నెపంతో రబాడపై తీవ్ర చర్యలు తీసుకున్న ఐసీసీ తీరును క్రికెట్‌ ప్రపంచం ఆక్షేపిస్తున్నది..! ప్రపంచం మొత్తం చీటర్స్‌ అంటూ దుమ్మెత్తిపోస్తున్న వారిపై ఇంత ఔదార్యం ఎందుకని ప్రశ్నిస్తున్నది..! మరోవైపు క్రికెట్‌ ఆస్ర్టేలియా.స్మిత్‌ కెప్టెన్‌గానే కొనసాగుతాడని చెప్పడం సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.