ఏప్రిల్ 9న హైదరరాద్ లో జర్మన్ ఫిల్మ్ ఫెస్ట్

0
59
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
హైదరరాద్ నగరంలో తెలంగాణా రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుంచి అయిదు రోజులపాటు జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది.అయిదు రోజులపాటు రోజుకొక సినిమా చొప్పున అయిదు సినిమాలను ప్రదర్శిస్తారని తెలిపారు. సినీ అభిమానుల కోసం నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవంలో పాల్గొనాలని ఆయన కోరారు.
చిత్రోత్సవంలో ప్రదర్శించబడే జర్మన్ చిత్రాలు
ఈ చిత్రోత్సవంలో అగ్విరా రత్ ఆఫ్ గాడ్ (1972), ఫిజ్కారాల్డో (1981), చోస్ ఫ్రమ్ ఏ సంబర్ ఎంపైర్ (1990), ఫతా మోర్గానా (1970), బెల్స్ ఫ్రమ్ ద డీప్ (1993) చిత్రాలను ఈ వేడుకల్లో ప్రదర్శిస్తారు. రవీంద్ర భారతిలోని పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్‌లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు ప్రదర్శన ప్రారంభమవుతుంది.