దీపికా పడుకొనేతో నటి౦చడం లేదు…కోహ్లీ

0
69
advertisment

మనచానల్‌న్యూస్‌ – స్పోర్ట్స్‌డెస్క్‌
దీపికా పడుకొనేతో తాను నటి౦చడం లేదని భారతజట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపారు. ఇదేమిటీ కోహ్లీ ఏమిటి? దీపికా పడుకొనేతో నటి౦చడం ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారా..అయితే దీని అసలు కథేంటంటే… ప్రస్తుతం భారత్‌లో మెగా ఐపీఎల్‌ టోర్నీ సందడి మొదలైంది. ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం ఇప్పటి నుంచి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టుకు ‘గోఐబిబో’ రూ.11కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో బాలీవుడ్‌ భామ దీపిక పదుకొణెని గోఐబిబో బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. తాజాగా ఆర్‌సీబీతో ఒప్పందం కుదుర్చుకున్న గోఐబిబో విరాట్‌ కోహ్లీ-దీపిక పదుకొణె మీద ఐపీఎల్‌ కోసం ఓ యాడ్‌ తీద్దామనుకున్నారు. ఇదే విషయాన్ని కోహ్లీకి తెలపగా.. దీనికి అతడు నో చెప్పినట్లు సమాచారం. దీంతో గోఐబిబో ఆర్‌సీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘మా యాడ్‌లో నటించనని కోహ్లీ నో చెప్పలేదు. ప్రచార కార్యక్రమాల్లో మరో సెలబ్రెటీతో నటించనని మాత్రమే చెప్పాడు’ అని గోఐబిబో నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ఒప్పో మొబైల్స్‌కి కోహ్లీ, దీపికలు బ్రాండ్‌ అంబాసిడర్లగా ఉన్న సంగతి తెలిసిందే.గతంలో ఆర్‌సీబీ జట్టుకు దీపిక పదుకొణె బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 2007-08 సమయంలో ధోనీ ఆ తర్వాత యువరాజ్‌ సింగ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. దీపిక కోసమే ధోనీ తన పొడవాటి జట్టును కత్తిరించేసుకున్నాడని కూడా రూమర్లు చక్కర్లు కొట్టాయి.