భారతీయ పిల్లలలో పెరుగుతున్న టైప్ -1 డయాబిటిక్

0
139
advertisment

మనఛానల్ న్యూస్ – హెల్త్ డెస్క్

భారతదేశంలో మధుమేహ వ్యాధి మహామ్మరిలో మారుతోంది. ఇది భావి తరాల పిల్లలకు రోజురోజుకి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది.ప్రస్తుతం దేశంలో 97,000 మంది పిల్లలు టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్నారు, ప్రస్తుతం ఢిల్లీలో లక్ష మంది పిల్లలలో 32 మంది డయాబిటికి వ్యాధితో బాధ పడుతున్నారు.

ఇటివల కాలంలో వ్యాధి నిర్దారణకు వివిధ రకాల ఆధునిక పరికరాలు రావడం వల్ల వైధ్యులు సకాలంలో వ్యాధిని గుర్తించి తగిన ఆధునిక చికిత్సలు అందిస్తూ ప్రజలకు మెరుగైన జీవనాన్ని ప్రసాది స్తున్నారు.ఢిల్లీలో నానాటికి బాల్యదశలోనే మధుమేహ వ్యాధి టైప్-1 పెరగడం ప్రమాద సంకేతాలను సూచిస్తోంది. ఢిల్లీ వంటి నగరాలలో మారిన జీవన విధానాలు, అలవాట్లు, మితిమీరిన పోషకాలున్న ఆహారం తీసుకోవడం, పిల్లలకు వ్యాయమ లేకపోవడం వంటి అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల ఈ వ్యాధి పెరగడానికి ఆస్కారం కల్గుతోంది. పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు క్రీడలు పాల్గొనడానికి గురించి ఆలోచించకోపోవడం, అభ్యంతరాలను వ్యక్తం చేయడం వల్ల పిల్లలు అనారోగ్యం పాలు అవుతున్నారు.

– టైప్ -1 రకం డయాబెటిస్ పిల్లలకు మాత్రమే వస్తుంది. పిల్లల్లో బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది పెద్దలకు కూడ ఈ వ్యాధి సంక్రమించవచ్చు.
– పిల్లలలో టైప్ -1 డయాబిటిక్ వ్యాధి ఉండడం దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. గర్బంతోనున్న మహిళలకు ఈ వ్యాధి ఉండడం వల్ల అది శిశువుకు డయాబిటెక్ సోకే అవకాశాలు అధికం. గర్బంతో ఉన్న మహిళలు ఆరోగ్యంతో ఉండి పిల్లలకు జన్మనివ్వడం  వల్ల  పిల్లలు కూడ ఆరోగ్యంగా ఉంటారు.ఉందుకే ఇలాంటి వ్యాధుల విషయంలో తల్లి పాత్ర అధికం.
– జీవన విధానంలో చురుకుగా వ్యవహారించేవారికి మధుమేహ వ్యాధి రాదు. మంచి ఆహార అలవాట్లు, నియంత్రణ, అతిగా బరువు పెరిగే ఆహారాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకొంటే ఈ వ్యాధి రాదు.
– యోగ మరియు ఆయుర్వేదం ద్వారా ఈ వ్యాధిని నయం చేయలేవని నిర్థారణ అయింది. వీటి వల్ల కేవలం నియంత్రణ మాత్రమే జరుగుతుంది.
– పిల్లలను తీవ్రమైన ఓత్తిళ్లుకు గురి చేసే పనులు చేయరాదు. వారు స్వేచ్ఛగా ఆలోచించే పని చేసే అవకాశం కల్పించాలి.పిల్లలకు తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పాలి. ఖచ్చితంగా వ్యాయామానికి తగిన సమయాన్ని కేటాయించాలి.
– టైప్ – 1 డయాబిటిక్ పిల్లలలో ఇన్సులిన్ సమస్యల రాకుండా తల్లిదండ్రులు నిరంతరం అవగాహాన పెంచుకోవాలి.
భావి భారత పిల్లలు బాల్యంలోనే అనారోగ్యానికి గురవవుతుండడం ఎంతో ఘోరం. దేశం ఇప్పటి వరకు ఎన్నో రకాల వ్యాధులను జయించింది. డయాబిటిక్-1 వ్యాధిని సైతం జయించాలంటే ప్రజల సహాకారం ఎంతో అవసరం. అయితే మారుతున్న  జీవన విధానం మూలంగా వస్తున్న ఈ వ్యాధులను పిల్లలకు రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులలో మార్పు రావాలి. పిల్లల ఆహారపు అలవాట్లపై ప్రాథమిక స్థాయి నుంచే శిక్షణ ఇవ్వాలి. ఆహారపు అలవాట్లుపై పాఠశాలలో పర్యవేక్షణ అవసరం.ప్రతి బడికి ఓ న్యూట్రీషన్ ను నియమించి వారి ద్వారా పిల్లల భవిష్యత్ కు ఆరోగ్యకర పునాధులు నిర్మించాలి. ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారని ఆశిద్దాం.