వివరాలిస్తే ఎపికి ప్యాకేజీ రడీ – కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి

0
137
advertisment
మనఛానల్ న్యూస్ – న్యూఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారములో భాగంగా కేంద్రం ప్యాకేజీ ఇవ్వడానికి ఎప్పుటి నుంచో సిద్ధంగా ఉందని, సరైన వివరాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్లే సకాలంలో ఇవ్వలేకపోయామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి వెల్లడించారు. లోకసభలో ఎపికి చెందిన రాజకీయ పార్టీలు వైకాపా,టిడిపిలు కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి నోటిసులు ఇచ్చిన తరుణంలో కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ అంశంపై స్పందించారు.
ఎన్.డి.ఎలో భాగస్వామిగా ఉన్న టిడిపి ప్రత్యేక హోదా బదులు దానికి సమానమైన ప్యాకేజీకి సమ్మతించిందని, అయితే ప్రజలలో ప్రత్యేకహోదా సెంటిమెంట్ బలంగా నాటుకున్న తరుణంలో టిడిపి ప్రత్యేక హోదా డిమాండ్ తో కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగినదని అరుణ్ జైట్లి వివరించారు.
ఎపి విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశం కేంద్రంలో అమలులో ఉన్నందున తాము అప్పట్లో హోదా హామి ఇచ్చామని అయితే అనంతరం 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే విధానాన్ని తొలగించమని సూచించిందని, దాని స్థానంలో వెనుకబడిన రాష్ట్రాలు ఆర్థికంగా ఎదగడానికి రెవెన్యూలోటును భర్తీ చేస్తే సరిపోతుందని ఆర్థిక సంఘం సిపార్సు చేసిందని అరుణ్ జెట్లీ పేర్కొన్నారు.కేంద్రం రాష్ట్రాలకు నిధుల కేటాయింపు అందరికి సమానంగా చేస్తుందని సెంటిమెంట్ల పేరుతో ప్రత్యేకంగా నిధులు అందించే అవకాశం లేదనిజైట్లి స్పష్టం చేశారు.
అయినప్పటికి ఎపికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పంపుతుందని తాము ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇచ్చేందుకు ఇప్పటికి సిద్ధంగా ఉన్నామని అరుణ్ జైట్లి స్పష్టం చేశారు.