అమితాబ్ ఆరోగ్యంపై పుకార్లు- ఆయన క్షేమం – జయబచ్చన్ వెల్లడి

0
114
advertisment

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
అమితా బచ్చన్ ఆరోగ్యంపై మంగళవారం పుకార్లు చెలరేగాయి. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన సతీమణి, నూతన రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ వెంటనే స్పందించారు. అమితా బచ్చన్  ప్రస్తుతం రాజస్థాన్ లో థగ్స్ ఆప్ హిందోస్థాన్ అనే సినిమా షూటింగ్ లో ఉన్నారని మెడ నొప్పి, మరియు ఇతర నొప్పులతో కొంత బాథపడుతున్నారని అయితే ఆయనకు ఏలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. అమితాబ్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని తెలియచేశారు.అయితే ఆయనకు జోథ్ పూర్ లో డాక్టర్లు చికిత్స చేసినట్లు వార్తలు వస్తున్నాయి.