ఘనంగా ప్రపంచ ”ఆలోచనా దినోత్సవం”

0
107

మనచానల్‌, మదనపల్లి న్యూస్‌

ప్రపంచ ఆలోచనా దినోత్సవ౦ సందర్భంగా స్థానిక జ్ఞానోదయ పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు లార్డ్‌ బెడెన్‌ పావెల్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జ్ఞానోదయ పాఠశాల నందు ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ర్యాలీగా వెళ్లి బెంగళూరురోడ్డు కూడలి వద్ద గల అనిబిసె౦ట్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండె౦ట్, రాష్ట్ర స్కౌట్స్ అసిస్ట౦ట్ కమిషనర్‌ కామకోటి ప్రసాదరావు మరియు పాఠశాల డైరెక్టర్‌, మదనపల్లి మునిసిఫల్‌ వైస్‌చైర్మన్‌ జోళపాలెం భవానీప్రసాద్‌లు మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణ, సేవాభావం కలిగి ఉండాలని కోరారు. విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. మంచి సేవాభావంతో మెలిగి జిల్లాకు, రాష్ట్రానికి మంచి గుర్తింపు తేవాలని వారు తెలిపారు.