బిజెపి, టిడిపిల మధ్య దూరం

0
68
advertisment

మనచానల్ న్యూస్ – న్యూఢిల్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా నిదులు కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టింది. నేడు మోడి ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగించాలా వద్దా అనే సంకట స్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలానే కొనసాగిస్తే వచ్చే ఎన్నికలలో టిడిపికి ఇబ్బందులు తప్పేటట్టు లేవని అంచనా. మరో వైపు బి.జె.పి కేంద్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీ తక్షణం కేంద్రప్రభుత్వం నుంచి వైదొలిగినా ఇబ్బందులేమి ఉండవని బి.జె.పి బావిస్తోంది. దీంతో చంద్రబాబునాయుడు తక్షణం ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.మార్చి నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాలలో తెలుగుదేశం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సమస్యను బి.జె.పిపైకి నెట్టి కేంద్ర్రప్రభుత్వం నుంచి తప్పకోవాలన్నది తెలుగుదేశం వ్యూహంగా కన్పిస్తోంది.దానికి తగ్గట్టు అనుకూల తెలుగు మీడియాను వాడుకొని రాష్ట్రంలో దీనివల్ల ఏర్పడే  ప్రజావ్యతిరేకతను కొంత వరకు తగ్గించుకోవాలన్నది చంద్రబాబు యోచనగా కన్పిస్తోంది.తాము ఎన్ని మార్లు సహాయాన్ని అర్థించినా మోది పట్టించుకోవడంలేదని చంద్రబాబు ప్రధాన ఆరోపణ. మిత్రపక్షంగా తమకు ఓపిక నశిస్తున్నట్లు పార్టీ నాయకులు వాపోతున్నారు.అయితే బిజేపి కూడ తెలుగుదేశం పార్టీకి దీటైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆపార్టీ  అధిష్టానం ఇప్పటికే స్ఠానిక నాయకత్వానికి టి.డి.పిపై దాడికి సంకేతాలు ఇచ్చినట్టు ఇటివల కర్నూలులో జరిగిన బి.జె.పి. పార్టీ సమావేశములో బిజెపి ఎం.ఎల్.సి సోమువీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. సోము వీర్రాజు వ్యాఖ్యలను  బిజెపి కేంద్రనాయకత్వం ఏ మాత్రం ఖండించలేదు.అయితే, సోమువీర్రాజును బిజెపి అధినేత అమిత్ షా మందలించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిని సోము వీర్రాజు శుక్రవారం ఖండించారు. తనను అమిత్ షా మందలించలేదని తనకు అసలు ఫోనే చేయలేదని, కావాలంటే ఫోన్ కాల్ లిస్ట్ చూసుకోవాలని కోరారు. దీనిని బట్టి చూస్తే బిజెపి అధిష్టానం సైతం చంద్రబాబుతో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు కన్పిస్తోంది.చంద్రబాబు నాయుడు స్వతహాగా బిజెపికి దూరం అయ్యే అవకాశాలు లేవు.నిధుల కేటాయింపులో కేంద్ర వైఖరి ఇలానే ఉంటే దానిని అవకాశం చేసుకొని భయట పడాలన్నది టిడిపి ఎత్తుగడగా కన్పిస్తుండగా, ఎపిలో తెలుగుదేశం పార్టీ అలివిమాలిన హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోవడం వల్ల ప్రజలలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని ఇది వచ్చే ఎన్నికలలో బిజెపి, టిడిపి రెండింటికి ఇబ్బందులకు గురిచేస్తుందని ఇందుకు ముందుగానే టిడిపిని దూరం పెడితే మంచిదనే భావన బిజెపి నాయకత్వంలో కన్పిస్తోంది.దానికి తోడు కేంద్రం నుంచి వస్తున్న నిధులను చంద్రబాబు తన పార్టీ అభివృద్ధికి వినియోగించుకొంటున్నారని, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను ఆకర్షణకు నిధులు వినియోగిస్తున్నారనే ఆరోపణలు రావడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం తనవిగా ప్రచారం చేసుకొంటున్నారనే బిజెపి అంతర్గతంగా వాపోతోంది.ప్రభుత్వ పథకాలలో అవినీతి పెరిగిందని బిజెపి నాయకుల ఆరోపణ. ఈ పరిస్థితులలో బిజెపి-టిడిపి బంధం కోనసాగుతుందనేది ప్రశ్నార్థకమే.

టిడిపికున్న తక్షణ సమస్యలేమి

  1. నిధులు ఇవ్వడంలో బిజేపి విఫలమైన విషయం స్పష్టం అవుతుంది.దానితోపాటు ఈ మూడన్నరేళ్లలో టిడిపి అధికార బిజెపి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి సాధించలేని పార్టీగా మిగిలిపోతుంది.
  2. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు భయంతో మోదీని రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం నిలదీయలేకపోయారన్న ప్రతిపక్ష పార్టీల నిందలు నిజమేననే బలపడవచ్చు.
  3. బిజెపిను ఎదిరించి 2019లో జరిగే ఎన్నికలలో అధికారం సంపాధించినా మళ్లీ కేంద్రంలో బిజెపి పార్టీనే అధికారములోకి వస్తే టిడిపి పరస్థితేమి…. ఎపి పరిస్థితేమి కావాలి.